Sunday, October 30, 2016
Friday, October 21, 2016
నాకు నచ్చిన తెలుగు పాటలు - మీకు కూడా నచ్చవచ్చు
- ఏ తీగ పువ్వును ఏ కొమ్మ టేకినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
- జూనియర్, జూనియర్, అటు ఇటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు
- సిరిమల్లె నీవే, విరిజల్లు కావే, వరదల్లె రావే వలపంటి నీవే...
- తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి ...
- ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవులో మెరిసిన ప్రేమ గీతమో
- శివరంజని, నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు...
- ఓ బంగరు రంగుల చిలుకా పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని..
- ఈ పాల వెన్నెల్లో నా జాలి కళ్ళల్లో ఇద్దరూ వున్నారు ఎవ్వరూ వారెవరు
- మరు మల్లియ కన్నా తెల్లనిదీ, మకరందం కన్నా తీయనిది
- పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో....
మరిన్ని తరువాతి పోస్ట్ లో
పెళ్లి చూపులు (సినిమా)
పెళ్లి చూపులు, ఒక మంచి టైం పాస్ కామెడీ సినిమా ఇది.
తక్కువ బడ్జెట్ తో కొత్తవారితో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయ్యింది.
కధ కన్నా కధనం బావుంది. నేటి తరానికి నచ్చే విధంగా సినిమా తీయడంలో డైరెక్టర్ ప్రతిభ చూపించాడు
తప్పకుండా చూడవచ్చు!
తక్కువ బడ్జెట్ తో కొత్తవారితో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయ్యింది.
కధ కన్నా కధనం బావుంది. నేటి తరానికి నచ్చే విధంగా సినిమా తీయడంలో డైరెక్టర్ ప్రతిభ చూపించాడు
తప్పకుండా చూడవచ్చు!
Monday, September 26, 2016
Majnu (Nani) 2016 - Review
మజ్ను - పెద్దగా లేదు (టైం పాస్)
మొన్నమా టీం తో కలిసి మజ్ను సినిమాకి వెళ్ళాను. సినిమా ఆలా వెళ్లి పోయింది. కధ పాతదే. నాని ఉండబట్టి ఆ సినిమా కొంత ఒకే అనిపించింది. కొత్త హీరోయిన్ లు పర్వాలేదు. సంగీతం బావుంది, పాటలన్నీ మెలోడీగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు అంతా టైం పాస్, మరియు 2వ భాగం అంతా సాగదీసి, అసహజంగా అనిపించింది. డబ్బులు పెట్టి చూడవలసిన సినిమా అయితే మాత్రం కాదు . ఇక మీ ఇష్టం
నేను దీని 2.5 రేటింగ్ ఇస్తాను
Saturday, September 10, 2016
ట్రాఫిక్ సమస్యలు
ట్రాఫిక్ సమస్యలు
మనం ఎన్నో చోట్ల ట్రాఫిక్ సమస్యలను నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నాము.దీని వాళ్ళ మనం పలు విధాలుగా నష్టపోతున్నాము. ఉదాహరణకి ట్రాఫిక్ సమస్యల వల్ల మనం ధనం, ఎంతో విలువైన కాలం నష్టపోతున్నాం మరియు అనవసరంగా శ్రమకు గురి అయ్యి ఒత్తిడి పెంచుకుని తద్వారా ఆరోగ్యాన్ని కూడా నష్టపోతున్నాం. అంతే కాకుండా పెట్రోల్, డీజిల్ వంటి పరిమిత వనరులను కూడా అకారణంగా తొందరగా కోల్పోతున్నాం.
అలాగే ట్రాఫిక్ వల్ల ఒక్కోసారి టైంకి అందుకోవాల్సిన ట్రైన్, బస్సు, లేదా విమాన ప్రయాణాలు చెయ్యలేక నష్టపోతున్నాం. ట్రాఫిక్ సమస్య చాప కింద నీరు లాంటిది. మనకి తెలియకుండానే మనలని కాల్చేస్తుంది. రోజూ దాన్ని గురించి తిట్టుకున్నా మనం ఏమి చెయ్యలేక పోతున్నాం ఎందుకు ?
ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే అసలు ట్రాఫిక్ సమస్యలు ఎందుకు వస్తున్నాయో పరిశీలించాలి.
1. తగినంత ప్రజా రవాణా వ్యవస్థ లేక పోడం
2. ఉన్న వ్యవస్థను సరిగ్గా వినియోగించలేకపోవడం.
3. అందరూ ఒకే సారి కార్యాలయాలకు లేదా బయట పనులకు బయలుదేరడం
4. ప్రతీవాళ్ళూ తమ సొంత వాహనాలను వినియోగించడం (ఇది 1 వ పాయింట్ కి లింక్ అయి వుంది)
5. ప్రభుత్వ కార్యాలయాలు, సర్వీస్ చేసే సంస్థలు ఒకే చోట ఉండడం
6. ప్రజలు అనవసరంగా షాపింగ్ పేరిట టైం పాస్ చెయ్యడం...
7. అందరూ తామే ముందు వెళ్ళాలి అనుకోడం
8. ప్రజలలో ఓపిక పాలు నశించడం ముఖ్యంగా ఈ తరం పిల్లలకు, యువకులకు.
వచ్చే బ్లాగ్ లో ఏమి చేస్తే మనం ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించవచ్చు.
మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి.
Subscribe to:
Posts (Atom)