ట్రాఫిక్ సమస్యలు
మనం ఎన్నో చోట్ల ట్రాఫిక్ సమస్యలను నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నాము.దీని వాళ్ళ మనం పలు విధాలుగా నష్టపోతున్నాము. ఉదాహరణకి ట్రాఫిక్ సమస్యల వల్ల మనం ధనం, ఎంతో విలువైన కాలం నష్టపోతున్నాం మరియు అనవసరంగా శ్రమకు గురి అయ్యి ఒత్తిడి పెంచుకుని తద్వారా ఆరోగ్యాన్ని కూడా నష్టపోతున్నాం. అంతే కాకుండా పెట్రోల్, డీజిల్ వంటి పరిమిత వనరులను కూడా అకారణంగా తొందరగా కోల్పోతున్నాం.
అలాగే ట్రాఫిక్ వల్ల ఒక్కోసారి టైంకి అందుకోవాల్సిన ట్రైన్, బస్సు, లేదా విమాన ప్రయాణాలు చెయ్యలేక నష్టపోతున్నాం. ట్రాఫిక్ సమస్య చాప కింద నీరు లాంటిది. మనకి తెలియకుండానే మనలని కాల్చేస్తుంది. రోజూ దాన్ని గురించి తిట్టుకున్నా మనం ఏమి చెయ్యలేక పోతున్నాం ఎందుకు ?
ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే అసలు ట్రాఫిక్ సమస్యలు ఎందుకు వస్తున్నాయో పరిశీలించాలి.
1. తగినంత ప్రజా రవాణా వ్యవస్థ లేక పోడం
2. ఉన్న వ్యవస్థను సరిగ్గా వినియోగించలేకపోవడం.
3. అందరూ ఒకే సారి కార్యాలయాలకు లేదా బయట పనులకు బయలుదేరడం
4. ప్రతీవాళ్ళూ తమ సొంత వాహనాలను వినియోగించడం (ఇది 1 వ పాయింట్ కి లింక్ అయి వుంది)
5. ప్రభుత్వ కార్యాలయాలు, సర్వీస్ చేసే సంస్థలు ఒకే చోట ఉండడం
6. ప్రజలు అనవసరంగా షాపింగ్ పేరిట టైం పాస్ చెయ్యడం...
7. అందరూ తామే ముందు వెళ్ళాలి అనుకోడం
8. ప్రజలలో ఓపిక పాలు నశించడం ముఖ్యంగా ఈ తరం పిల్లలకు, యువకులకు.
వచ్చే బ్లాగ్ లో ఏమి చేస్తే మనం ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించవచ్చు.
మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి.
No comments:
Post a Comment